Hanuman Jayanti రోజు హైదరాబాద్‌లో బార్లు ఎందుకు మూసివేత? పూర్తి వివరాలు!
01-04-2026 04:19 PM
హైదరాబాద్: హనుమాన్ జయంతిని(Hanuman Jayanti) పురస్కరించుకుని గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను మూసివేయాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 కింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, ప్రజా శాంతి, సుస్థిరత దృష్ట్యా సైబరాబాద్ పరిధిలోని స్టార్ హోటళ్లు, నమోదిత క్లబ్బులలోని బార్లను మినహాయించి వైన్, కల్లు దుకాణాలు, అలాగే రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ ఆదేశించారు.




