28 August, 2026 | 12:55 PM

ఓటరు జాబితా సవరణపై గ్రామసభ

28-08-2026 11:01 AM

ఓటర్ జాబితాలో నమోదు కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోండి.

సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్. 

ఆళ్ళపల్లి ఆగస్టు 28 (విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ ఓటర్ జాబితా సవరకు సంబంధించి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వాసన్ సుష్మిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ గడ్డం ఉమారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసం సుష్మిత శ్రీకాంత్ మాట్లాడుతూ... ఎస్ ఐ ఆర్ ఓటర్ నమోదు లో ఏమైనా దోషాలు ఉంటే సవరించుకోవచ్చని ఓటరు జాబితాలో నమోదు కాని వారు మరల బి ఎల్ ఓ లను సంప్రదించి ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఇప్పటికే వివాహాలై వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు అలాగే మృతి చెందిన వారి ఓటర్ కార్డులను రద్దు చేయడం జరిగిందని ఇటువంటి అభ్యంతరాలు ఉన్న ఓటర్ కార్డు సవరనకు సంబంధించి వివరాలకు పంచాయతీ కార్యాలయంలోని కార్యదర్శిని సంప్రదించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సయ్యద్ ఆరిఫ్ కార్యదర్శి ఉపేందర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.