calender_icon.png 6 February, 2026 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

06-02-2026 10:05:02 AM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడీ వీరస్వామి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తుంగతుర్తి నియోజకవర్గంలోని 2మున్సిపాలిటీలను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో- ఆర్డినేటర్,తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి అన్నారు.గురువారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ2 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ఎన్నికల హామీల్లో ఇచ్చినట్లుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,పేదలకు సన్నబియ్యం,ముఖ్యమంత్రి సహాయనిధి,గృహ జ్యోతి పథకం,ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ,నూతన రేషన్ కార్డులు,షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలే మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే దక్కిందన్నారు.తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల సామేలు గెలిచిన నాటి నుండి గ్రామాలతో పాటు మున్సిపాలిటీలలో అనేక మౌలిక వసతుల కల్పనకు,అభివృద్ధికి అత్యధిక నిధులు వెచ్చించడం జరిగిందన్నారు.అదేవిధంగా తిరుమలగిరిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల,జూనియర్ కళాశాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ధీమా వ్యక్తం చేశారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి తమ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపెల్లి వెంకట్ రెడ్డి,కొనతం వెంకటరెడ్డి,జీడి సైదులు,నల్లగుంట్ల నాగేందర్,జీడి శ్రావణ్,ఈదునూరి రాము తదితరులు పాల్గొన్నారు.