20 April, 2026 | 10:54 PM

పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి

20-04-2026 09:42 PM

సర్పంచ్ వెంకన్న 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గర్భిణీలు,బాలింతలు,చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు.మండలంలోని రామన్నగూడెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ్ పక్వాడపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగంపల్లి రవీందర్, అంగన్వాడీ టీచర్ పుష్పలత, వార్డు సభ్యులు తవిటి సైదులు, ఆశా కార్యకర్త శైలజ, వీఓఏ సరిత, ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.