10-02-2026 01:33:08 AM
20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పల మధుసూదన్
గజ్వేల్, ఫిబ్రవరి 9: 40 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గెలిపిస్తే ప్రజాసేవ చేసుకుంటానని, నిజాయితీగా పనిచేస్తారని 20వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పల మధుసూదన్ అన్నారు. సోమవారం ఆయన ఇంటింటి ప్రచారంలో ప్రజలను తనకు ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు.
ఉజ్వల యోజన, ఉచిత రేషన్ బియ్యం, ఫసల్ బీమా, సబ్సి డీ యూరియా ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ప్ర ధాని నరేంద్ర మోడీ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. పట్టణాల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిదులిస్తుందని, తనను ఓటేసి గెలిపిస్తే తన వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, నాయకులు అరవింద్, శ్రీనివాస్, జనార్ధన్, మహిళా నాయకులు పాల్గొన్నారు.