12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

5వ వార్డులో వకీల్ సాబ్‌దే విజయం

14-02-2026 01:16 AM
  1. నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు

కౌన్సిలర్ ముస్కుల సయేందర్ రెడ్డి

మంథని ఫిబ్రవరి 05(విజయ క్రాంతి) మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5వ వార్డులో పోటీ చేసిన విద్యావేత్త సీనియర్ వకీల్ సాబ్, కౌన్సిలర్ ముస్కుల సయేందర్ రెడ్డి విజయం సాధించాడు. 5వ వార్డులో ఉన్న శ్రీరామ్ నగర్, కూచిరాజ్ పల్లి బోయిన్ పేట, గొల్లగూడెం, గంగాపురి గ్రామాల ప్రజలు సయేందర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు.

చదువుకున్న శైలేందర్ రెడ్డి కి ప్రజలు పట్టం కట్టడంతో ఇక ఐదో వార్డు అభివృద్ధి గురించి ఆలోచించి మంత్రి శ్రీధర్ బాబు శ్రీను బాబుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సయేందర్ రెడ్డి తెలిపారు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మంత్రి శ్రీధ ర్ బాబుకు శ్రీనుబాబుకు, తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు, పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.