9 July, 2026 | 11:09 PM

రాజ్యసభలో BRS ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర

09-07-2026 01:58 PM

హైదరాబాద్: రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ పక్షనేతగా(BRS Floor Leader) వద్దిరాజు రవిచంద్ర నియామకం అయ్యారు. ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్ రెడ్డి(Floor Leader K.R. Suresh Reddy) ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. సురేశ్ రెడ్డి స్థానంలో వద్దిరాజు రవిచంద్రను(Vaddiraju Ravichandra) బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) నియమించారు. వద్దిరాజు రవిచంద్ర ఇప్పటివరకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఉపనేతగా ఉన్నారు. వద్దిరాజును ఫ్లోర్ లీడర్ గా నియమిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు కేసీఆర్ లేఖ రాశారు.