28 March, 2026 | 6:22 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

సమన్వయ కృషితోనే పట్టణ అభివృద్ధి

26-03-2026 01:53 AM

కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయ కృషితోనే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందుతాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు సాగుతుందని, అందులో భాగంగానే గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి దోహద పడిందని తెలిపారు. తొర్రూరు మున్సిపల్ పట్టణ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయాలని అందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు.

వార్డుల్లో అంతర్గత అభివృద్ధి పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు, పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి, చెట్లు నాటడం, పచ్చదనం, పరిశుభ్రత పాటించడం, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా షెడ్యూలు ప్రకారం కేటాయించిన అభివృద్ధి పనులు నిర్వహించాలని, తమ వార్డు పరిధిలో ఏం జరుగుతుందనే అంశాలను గమనిస్తూ ఉండాలని, యువత చెడు వ్యసనాలకు ఆడట్టు కాకుండా గమనిస్తూ ఉంటూ ఏదైనా సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సూచించారు.

పట్టణ పరిధిలో అభివృద్ధి  పనులు నిర్వహించడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశం ఆమోదం తీసుకొని పనులను ప్రారంభించాలని, పట్టణంలో ఎప్పటికప్పుడు ఉదయమే శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ యొక్క పన్నులను చెల్లించాలని, తద్వారా పట్టణ అభివృద్ధికి తమ భాగస్వామ్యం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 2026-27 బడ్జెట్ రూపకల్పన లో భాగంగా 1,784.98 లక్షల ఆదాయం,1,783.22 వ్యయంతో ప్రవేశపెట్టి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సోమ రజిని, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.