మేయర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభం ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): నగరంలో ని తీగలగుట్టపల్లిలో నూతన మేయర్ క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు... పాలకవర్గ సభ్యులకు, స్థానికులకు అందుబాటులో ఉండి.. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా క్యాంపు కార్యలయం పని చేస్తుందని తెలిపారు.
నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజల నమ్మకాన్ని.. వమ్మ చేయకుండా కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ నేతృత్వంలో మా నూతన పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో పాలకవర్గం ముందుంటుందని అన్నారు.
విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లు సమాంతరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రాధాన్యతగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పాలకవర్గ సభ్యులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




