6 April, 2026 | 5:12 AM

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

06-04-2026 03:29 AM

ధర్మపురి,ఏప్రిల్ 5(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలో సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు.కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, దేశాభివృద్ధిలో ఆయన అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ నివాళి కార్యక్రమంలో సర్పంచ్ బండమీది కవిత,జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రేగుంట నర్సయ్య,ఉపాధ్యక్షులు నక్క సురేష్,మాజీ సర్పంచ్ లు మెరుగు మురళీ గౌడ్,బండమీద ముత్తయ్య,వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, ఎనగందుల నరేష్,నాయకులు పెద్దూరి భరత్ కుమార్,బండమీది గోపి,ద్యావనపెల్లి అశోక్,కస్తూరి మల్లేష్,మూగల సతీష్,మూగల శ్రీనివాస్,గాజుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.