8 July, 2026 | 8:18 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

‘ఒపెక్’ నుంచి యూఏఈ నిష్క్రమణ

29-04-2026 12:23 AM

అబుదాబీ, ఏప్రిల్ 28: ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) సంస్థ నుంచి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తప్పుకోవాలని నిర్ణయించుకున్నది. గల్ఫ్ దేశాల వాణిజ్యాభివృద్ధి కోసం ఒపెక్ సంస్థ చేస్తున్న కృషిని తాము అభినందిస్తున్నామని, కానీ.. ఇకపై ఆ సంస్థలో తామిక కొనసాగే పరిస్థితులు లేవని తాజా గా ప్రకటించింది. సంస్థ నుంచి బయటకు రావడం వల్ల చమురు ఎగుమతులు, దిగుమతులపై పూర్తిగా తమ దేశానికే సర్వాధి కారాలుంటాయని తెలిపింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ ఇంధన రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.