22 March, 2026 | 7:42 AM

డెకాయిట్‌తో టాలీవుడ్ ఎంట్రీ!

22-03-2026 12:00 AM

అడివి శేష్ తొలి సారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్‌ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఖాకీ యూని ఫామ్‌లో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్.