3 April, 2026 | 5:06 PM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి

03-04-2026 02:56 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ రాజగౌడ్ తల్లి మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త తిమ్మాయ్య సుభాష్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి పార్థివ దేహానికి పూలు సమర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెబుతూ తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కప్పెరా రవీందర్ రెడ్డి (మాజీ వైస్ ఎంపీపీ, బీబీపేట), మట్ట శ్రీనివాస్ (సర్పంచ్), శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.