3 April, 2026 | 4:10 PM

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండా

03-04-2026 02:15 PM

బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉంది

 సీఎం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ఆగం 

టీఆర్‌ఎస్‌ పేరును ఎవరైనా వాడుకోవచ్చు

హైదరాబాద్: పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజలు ముందుకు వస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha New Party) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు TRSను ఎవరైనా వాడుకోవచ్చని కవిత స్పష్టం చేశారు. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని కవిత ప్రశ్నించారు. తన పార్టీ ఆచార్య జయశంకర్(Professor Jayashankar) సిద్ధాంతాల ప్రకారం నడుస్తోందని, తన పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని కవిత ఎద్దేవా చేశారు. పునర్విభజన అయినా.. కాకపోయినా తన పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందన్నారు. సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా?, ముఖ్యమంత్రి, గుంటనక్క మధ్య అవగాహనతో ఏం చేశారో? అని ప్రశ్నించారు. సీఎం ఫ్యూచర్ సిటీ(Future City) పేరుతో హైదరాబాద్ ను ఆగం చేసేలా ఉన్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదన్న కవిత కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తనకు సహకరిస్తోందన్నారు. మా అజెండా ప్రకటించాక.. చాలా మంది పార్టీలోకి వస్తారు. ఆరు గ్యారంటీల గురించి కేరళలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరంగా ఉన్నాయని కవిత చమత్కరించారు. హహారాష్ట్ర, బీహార్ కూడా ఇలాగే చెప్పారు.. కాంగ్రెస్ ను ఓడించారని కవిత విమర్శించారు.