అసెంబ్లీలో బీసీల ఊసే లేదు
01-04-2026 01:20 AM
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల డిమాండ్లను చర్చించకుండా బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం సరిదిద్దకుండా ముగించారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
హైదరాబాదులోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో కనీసం చర్చ కూడా పెట్టకపోవడం చాలా దారుణం అన్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు రాక బీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభు త్వంలో కనీసం స్పందనలేదన్నారు. బీసీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలన్నారు.




