తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక విజ్ఞప్తి
హైదరాబాద్: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా థియేటర్ల టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. సినిమా టికెట్ ధరలను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవోను ఖండించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు అసోసియేషన్, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పది రోజల గడువు ఇచ్చి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. టికెట్ ధరల నిర్ణయంపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని, http://G.O.Ms.No.77ను పునఃసమీక్షించాలని వినతి చేశారు. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలపై కొత్త వర్గీకణపై అభ్యంతరాలు చేయగా, స్పెషల్ థియేటర్లుగా కొత్త వర్గీకరణపై పరిశ్రమ వర్గాల ఆందోళన వ్యక్తం చేశారు.






