10 March, 2026 | 10:27 AM

స్వచ్ఛ సర్కిల్ అభివృద్ధియే.. ప్రధాన ధ్యేయం..

09-03-2026 03:08 AM

ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాల్లో.. కీసర సర్కిల్ ముందంజ..       

కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత

జవహర్ నగర్, మార్చి 8 (విజయక్రాంతి): స్వచ్ఛ సర్కిల్ అభివృద్ధియే ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాల్లో కీసర సర్కిల్ ముందు వరసలో నిలబడుతుందని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలో వివిధ కాలనీలలో లోకల్ స్టేట్ హోల్డర్ తో ఆదివారం స్వచ్ఛ సాతి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యంగా డ్రైనేజీ మరుగునీటి వ్యవస్థ కాలనీలో కూరుకుపోయిన చెత్తను స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేసి కీసర సర్కిల్ ఇతర సర్కిల్ లకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో మూడవ రోజు అయిన ఆదివారం సర్కిల్ పరిధిలోని సాయి శ్రీ రెసిడెన్సి, దమ్మాయిగూడ ,ఉప్పరపల్లి, జెడ్పిహెచ్‌ఎస్ హైస్కూల్, నందమూరి నగర్ ,జవహర్ నగర్, జ్యోతిరావు కాలనీ, అంబేద్కర్ నగర్, శివ శివాని కాలనీ,  దేవరయంజాల్, షామీర్పేట డివిజన్, ఎస్వీఎస్ హాస్పిటల్ రోడ్, తూముకుంట తదితర ప్రదేశాల్లో జివిపి పాయింట్స్ వద్ద లోకల్ స్టేక్ హోల్డర్స్ తో స్వచ్ఛ సాతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను మునిసిపల్ సిబ్బందిచే శుభ్రపరిచి, ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.