23 June, 2026 | 4:01 AM

రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

23-06-2026 01:16 AM
  1. ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు మానుకోవాలి
  2. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి.

ముస్తాబాద్,జూన్ 22( విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్న బిఆర్‌ఎస్  నాయకులకు నిరసనగా ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తు న్నారని పేర్కొన్నారు.

దేశానికి వెన్నుముక రైతని ఆ రైతును రాజును చేయడమే లక్ష్యంగా  కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పని చేస్తుందన్నారు.ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలోనే 1లక్ష కోట్లకు పైగా రైతులకు అందించిందన్నారు.ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు.గత ప్రభుత్వం రైతుల కోసం వచ్చిన ట్రాక్టర్ లను అమ్ముకొని,వరి వేస్తే ఉరి అన్నసంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.

మీ పాలనలో రైతులకు బేడీలు వేసి ఈ రోజు అదే రై తుల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలో పని ముట్లు అందిస్తూ రైతులకు లాభ దాయకమైన పంటల కోసం కూడా అవసరమైన పథకాలు అందిస్తుందన్నారు.రైతులకు సరిపోయే విధంగా విద్యుత్తు అందిస్తుందని తెలిపారు.రైతు భాందవుడు రేవంత్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

రైతులను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు నిరుత్సాహ పడవలసిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల రాజు ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు తాళ్ళ విజయ్ రెడ్డి మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ రంజాన్ నరేష్ గోపాలపల్లి ఉపసర్పంచ్ వేణు సీనియర్ నాయకులు ఆరుట్ల మహేష్ రెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి మిడిదొడ్డి భాను, ఆంజనేయులు,సాయి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.