ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
- కోటి రూపాయలు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
- తన వంతు సహాయంగా లక్ష రూపాయలు శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం
- ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్ ఏప్రిల్ 24 వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ గౌడ్ నిప్పు అంటించుకుని చనిపోవడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు.
మద్దతు తెలిపిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని ఆర్టీసీ కార్మికు లు ఏ ఏ సమస్యలతో అయితే సమ్మెను నిర్వ హిస్తున్నారో వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు . ఎవరు కూడా ఎలాంటి ప్రాణహాని చేసుకోరాదని ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావతం కాకుండా ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కు టుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా గా కోటి రూపాయలను ప్రకటించాలని ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన కోరారు. మరణించిన కార్మికుడి కుటుంబానికి నా తరఫున లక్ష రూపాయలు ఆర్థిక స హాయం అందించడం జరుగుతుందని అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ భాస్కర్, గ్రంథా ల సంస్థ మాజీ చైర్మన్ రామన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి ,విజయ్, సా యి శ్యామ్ రెడ్డి పాల్గొన్నారు.






