10 March, 2026 | 12:13 AM

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

09-03-2026 01:02 AM

సిద్ధిపేట, మార్చి 8 (విజయక్రాంతి): మహిళల సంక్షేమమే ధ్యేయంగా మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు.

సిద్ధిపేటలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పురపాలక సంఘంలోనీ పారిశుధ్య మహిళా సిబ్బందికి చీరలు అందజేసి, శాలువతో సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్తుఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నమన్నారు.

ఎన్నికల్లో ప్రజలకు, ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, రూ.5వందలకే సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్, కోట్లాది రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇలా దేశంలోనే మన రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక పథకాలు అందిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరో 10 సంవత్సరాలు ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు, గయాజుద్దీన్, హర్ష, హుస్సేన్, అజ్మత్, విజయ, డానియల్, మున్నా, సంతోషి, ముదసిర్ పాల్గొన్నారు.