సఫారీలదే నాలుగో టీ20
- ఛేజింగ్‌లో చేతులెత్తేసిన కివీస్
2 సిరీస్ సమం
వెల్లింగ్టన్, మార్చి 22 : న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సఫారీ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించిం ది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల్లు2 సమంగా నిలిచాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముల్దర్ డకౌటవడంతో ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.
తర్వాత రెం డో వికెట్‌కు ఎస్తర్హూజిన్, డిజోర్జీ 81 పరుగులు జోడించారు. కొన్నర్ ఎస్తర్హూజిన్ 36 బంతుల్లో , 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రుబిన్ హెర్మన్ 28 నాటౌట్, టోనీ డి జోర్జి 23 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.
టిమ్ రాబిన్సన్ 22 బంతు ల్లో 32 , డేన్ క్లెవర్ 26 పరుగులతో పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో గెరాల్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్మన్, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. హాఫ్ సెం చరీ చేసిన ఎస్తర్హుజిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలి టీ20లో సౌతాాఫ్రికా గెలిస్తే.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో కివీస్ పైచేయి సాధించింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టీ20 బుధవారం జరుగుతుంది.




