లారీలు ఢీకొని అగ్నిప్రమాదం.. కాలి మృతి చెందిన డ్రైవర్
సోనాల మండలం గుట్ట పక్క తండాలో విషాదం.
బోథ్,జూన్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున లారీలు ఢీకొనడంతో ఒకేసారి లారీకి మంటలు అంటుకోవడంతో లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ జవార్ సింగ్ (41) మృతి చెందాడు. సోనాల మండలంలోని గుట్ట పక్క తాండకు చెందిన మృతునికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు కుమారుడు ఉన్నాడు. గత పది సంవత్సరాలుగా కుటుంబ పోసిన కోసం లారీ డ్రైవర్ గా నిధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గుంటెడు భూమి సహితం లేకపోవడంతో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి నట్లయింది. సంఘటన వివరాలు తెలియడంతోనే కుటుంబీకులు గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా జరగనున్నట్లు తేలడంతో అక్కడికి చేరుకున్నారు. ఏది ఏమైనా డ్రైవర్ మృతితో గ్రామంలో విషాద చాయలు అమ్ముకున్నాయి






