20 March, 2026 | 4:39 AM

ఉగాది స్పెషల్ పోస్టర్ల సందడి

20-03-2026 01:01 AM

ఉగాది పండుగను పురస్కరించుకొని పలు సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్లను ఆయా చిత్రబృందాలు విడుదల చేశాయి. ప్రవల్లిక ఆరట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్ రెడ్డి నిర్మాతగా దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. ఈ బయోపిక్‌లో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘క్రేజీ కల్యాణం‘ చిత్రం నుంచి ఉదయ్ పాత్ర లో హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇంకా ‘స్వయంభు’ సినిమా నుంచి సంయుక్త మీనన్ స్పెషల్ పోస్టర్‌ను సైతం ఆ చిత్రబృందం విడుదల చేసింది. మరికొన్ని సినిమాల నుంచి కూడా ప్రత్యేక లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి.