26 February, 2026 | 5:46 AM

కుమ్మెరలో బాధితులపై దాడి హేయం

26-02-2026 12:00 AM

ఏమ్మార్పీఎస్ మండిపాటు

బడంగ్‌పేట్, ఫిబ్రవరి 25 : నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన చాకలి సామాజికవర్గానికి చెందిన గణేష్ కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. కులం పేరుతో దూషించి, మహిళలు అని కూడా చూడకుండా దాడి చేసి, రెండు నెలల పసికందు మరణానికి కారణమైన సర్పంచ్ తుకారాం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి బొర్రా రవి మాదిగ, బాలాపూర్ మండల ఇన్చార్జి మస్క సుధాకర్ మాదిగ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి బోర్ర రవి మాదిగ మరియు బాలాపూర్ మండల ఇన్చార్జ్ మస్కూరి సుధాకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని బాధితులకు మద్దతుగా నిలిచారు.