5 May, 2026 | 5:25 PM

కార్మికుల కార్యవర్గం ఏర్పాటు

05-05-2026 04:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపో టీజీ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు డి రాములు, అధ్యక్షులుగా జి రాజేశ్వర్, డిపో కార్యదర్శిగా ఉత్తం నాయక్ ఉప కార్యదర్శిగా బి గంగాధర్, కోశాధికారిగా లింగన్న మహిళా కార్యదర్శిగా తారాబాయిలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ సభ్యులు డిపో మేనేజర్ పండరీ కలిసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు