5 May, 2026 | 5:33 PM

బెంగాల్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ.. మే 9న ప్రమాణ స్వీకారం

05-05-2026 04:14 PM

పశ్చిమబెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం

బెంగాల్ నూతన సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ

మే 9న పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మే 9న పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రి(The New Chief Minister of West Bengal) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య(BJP State President Samik Bhattacharya), కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 9న జరుగుతుందని వెల్లడించారు. అయితే, పశ్చిమ బెంగాల్ లో నూతన సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో విజయం సాధించి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను మట్టికరిపించింది.