31 May, 2026 | 2:36 AM

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి

31-05-2026 01:40 AM
  1. జెడ్పీ స్కూళ్లను ఆయా జిల్లాలకు అప్పగించాలి
  2. లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): విద్యాశాఖలో ఖాళీగా ఉన్న విద్యాధికారుల పోస్టులకు వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఎం. వీరాచారి పేర్కొన్నారు. శనివారం సంఘ కార్యాల యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేలా ఏకీకృత సర్వీసుల వివాదం నలుగుతున్నదన్నారు.

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్ పాఠశాలలను వెంటనే ఆయా జిల్లాలకు అప్పగించాలని కోరారు. విద్యాశాఖలో పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారులు లేకపోవ డం వల్ల విద్యా పరిపాలన కుంటుపడుతుంద ని తెలిపారు. గతంలో రాష్ట్ర హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల ప్రకారం న్యాయబ ద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు వెంటనే మండల విద్యాధికారు లుగా, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులుగా, డైట్ కళాశాల అధ్యాపకులుగా వెంటనే ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో అసోసియేషన్ నాయకులు యాదగిరి, కే సుకన్య, గోపాల్ దాసు పాల్గొన్నారు.