18 April, 2026 | 3:06 PM

సమస్యల సాధనకు పోరాటమే శరణ్యం

18-04-2026 12:21 AM

భూత్పూర్, ఏప్రిల్ 17: తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజెయేసి)ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా ఉద్యోగుల డిమాండ్ల పై మండల తహసీల్దార్ కిషన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. టిజిఈజెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని స్థాయిల ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలిపారు.

అనంతరం తహసీల్దార్ కు ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉత్ఫ్ యుటీఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను డీఏ లను విడుదల చేయాలని, తెలంగాణ రెండో పిఆర్ సి నివేదికను తెప్పించి 51% ఫిట్మెంటుతో వెంటనే అమలు చేయాలని, ఈ ఎచ్ ఎస్ విధివిధానాలను రూపొందించి అమలుచేయాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే వారికి రావాల్సిన మొత్తాలను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రధాన డిమాండ్ల తో పాటు 64 రకాల డిమాండ్ల సాధనకు తెలంగాణా ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ దశలవారీగా ఉద్యమించనున్నదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు కృష్ణ,యాదయ్య, రేవతి, లింగం గౌడ్, సాయిరాం రెడ్డి, సాయిరాం ఖాదరయ్య, వెంకట్ నారాయణ, బాల్ రెడ్డి,ఆంజనేయులు,జెట్టి రామస్వామి, కనకమ్మ అధక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.