17 April, 2026 | 4:37 AM

పకడ్బందీగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు

17-04-2026 01:00 AM
  1. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక మండల సభ ఇల్లంతకుంటలో నిర్వహణ

అంగన్వాడీలకు ఆక్వా గార్డ్ యంత్రాల పంపిణీ

దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేత

ఆకట్టుకున్న వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు

ఇల్లంతకుంట, ఏప్రిల్ -16(విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం మండల సభ నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, మహిళా సంఘాల బాధ్యులు, రైతులు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో ప్రారంభించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించారు.

అరైవ్.. అలైవ్ కింద ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రత నియమాలు వివరించారు. పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు పంపిణీ చేశారు. దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేశారు.రైతు భరోసా లబ్ధిదారులు మొత్తం 17,883మందికి,రైతు రుణ మాఫీ5,745మందికి,మొత్తం593ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 185మంది ఇండ్లు పూర్తి అయ్యాయని,408ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని ఎంపీడీఓ శశికళ తెలిపారు.

మహాలక్ష్మి కింద8,985మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, గృహ జ్యోతి పథకం కింద200యూనిట్ల ఉచిత విద్యుత్9,572కుటుంబాలకు అందుతుందని,77మందికి సన్నరకం వరి బోనస్ అందిందని వివరించారు. చేయూత పెన్షన్స్7,915మందికి అందుతుందని, మండలంలో నూతనంగా1,974మందికి తెల్లరేషన్ కార్డులు పొందారని తెలిపారు.771మందికి కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పంపిణి చేశామని వెల్లడించారు.