ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్
13-06-2026 02:45 PM
హైరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Minister Tummala Nageswara Rao) సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు. సిట్ అధికారులు మంత్రి తుమ్మల వినియోగించిన నంబర్ చూసి వివరాలు, స్టేట్ మెంట్ తీసుకున్నారు. ట్యాపింగ్ కు గురైన వాటిలో తుమ్మల నంబర్ కూడా ఉండటంతో ఆయన ఇంటికి వెళ్లి అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నేతల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.






