2 May, 2026 | 9:46 PM

కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు

02-05-2026 08:22 PM

సన్మానించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నాయకులు

ఖమ్మం,(విజయక్రాంతి): కార్మిక దినోత్సవం సందర్భంగా  సుహృద్భావ పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమమునకు విశేష కృషి  చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  శ్రమశక్తి అవార్డును జిల్లా ఐయన్టీయుసి అధ్యక్షులు కొత్తా సీతారాములు  హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త సీతారాములు కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కొరకు విశేష కృషి చేసినందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డ్ కొత్తా సీతారాములు కు ఇవ్వటం అభినందనీయమని, జిల్లాలో ఐ యన్ టి యు సి బలోపేతం కొరకు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భానోత్ బాలాజీ నాయక్, జిల్లా కార్యదర్శి మూడుకుంతల గంగరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్, జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సందీప్, పంది రాజు గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అదే ఇటీవల అనారోగ్యంతో చికిత్సపొందుతూ పరమపదించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ కీర్తి శేషులు పెద్ది హయగ్రీవ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావు,ప్రధాన కార్యదర్శి కిలారి అనిల్ కుమార్, జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ,బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.