22 June, 2026 | 1:33 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

నన్ను కట్టేసుకోనా కాలమంతా నీతాన..

14-04-2026 02:02 AM

రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ చిత్రంతో ‘మారెమ్మ’తో హీరోగా బిగ్‌స్క్రీన్‌పై అడుగుపెడుతున్నారు. ఈ విలేజ్ యాక్షన్ -డ్రామాతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మయూర్‌రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఇందులో దీపా బాలు కథానాయిక కాగా వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటిస్తు న్నారు.

త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్న టీమ్ సోమవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ పాటను రిలీజ్ చేసింది. ‘ఒట్టేసుకోనా కోరమీసాల మీన.. నన్ను కట్టేసుకోనా కాలమంతా నీ తాన.. పెట్టేసుకోనా పాణాల మీద ఆన.. నిన్ను సుట్టేసుకోనా పంచపాణాలే ఇచ్చుకోనా.. నీ వాడి చూపు దాడి చేసె నను అడగకనే.. ఆ వేడి తగిలి నాడి రగిలె అసలాగకనే.. ముడిపెట్టేయనే పాలుగారె నా సోకులనే.. పని పట్టేయగా పాయిరంగ నా సొగసులనే.. బావా బావా అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే..’ అంటూ సాగుతోందీ పాట.

ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా, శ్రుతి రంజని పాడారు. నాయకానాయికలు మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి; ఎడిటర్: దేవ్ రాథోడ్; ఆర్ట్: రాజ్‌కుమార్ మురుగేసన్.