సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి
జి.ఎం కు శుభాకాంక్షలు తెలిపిన ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతికుమార్.
సత్తుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సత్తుపల్లి నుండి అత్యధికంగా సుమారు 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సత్తుపల్లి ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు గాను ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ను ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో శనివారం సన్మానం నిర్వహించారు.
ఐఎన్టీయూసీ జాయింట్ జనరల్ సెక్రెటరీ తీగల క్రాంతికుమార్ ఏరియా ఉద్యోగులకు అభినందనలు తెలుపుతూ సత్తుపల్లి ఏరియా ఉత్పత్తి సాధనలో జి.ఎం చింతల శ్రీనివాస్ దిశ నిర్దేశంతో లక్ష్యం సాధించారన్నారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా కు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉద్యోగస్తులు అధికారులు , యూనియన్ ప్రతినిధులు ఎవరికి వారు, వారి వారి కేటాయించిన పనులలో రక్షణతో నిర్వర్తించి ,నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగమన్నారు.
ఇదే స్పూర్తితో రానున్న ఆర్థిక సంవత్సరాలలో నిర్దేశించిన లక్ష్యాన్ని రక్షణతో పూర్తి చేయాలని సంస్థ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమించి కృషిచేయాలని , సింగరేణి సంస్థను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జి.ఎం బొల్లం శ్రీనివాస్ , ప్రహల్లాద్ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , జే.వి.ఆర్ ఓ సి ) , సునీల్ వర్మ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , కిష్టారం ఓసి ) , సోమశేఖర్ ( డీ.జి.ఎం , జే.వి.ఆర్ సి.హెచ్ పి ) , రాజేశ్వరరావు ( మేనేజర్ , జే.వి.ఆర్ ఓసి ) , రామకృష్ణ ( మేనేజర్ , కిష్టారం ఓసి ) ఇతర అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.




