28 March, 2026 | 3:38 PM

ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల

28-03-2026 01:52 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మంత్రి తుమ్మల(Minister Thummala Nageswara Rao) బాల్యంలో తనను ఆమె భుజాలపై వేసుకొని ఆడించిన అచ్చెమ్మ అత్తను చూడగానే అచ్చెమ్మ అత్తా బాగున్నావా అని ఆమెను మంత్రి తుమ్మల ఆప్యాయంగా పలకరించారు. అచ్చెమ్మ అత్త ఏమైనా పనిమీద వచ్చావా అని మంత్రి తుమ్మల ఆమెను అడగ్గా, లేదు బాబు నిన్ను చూసి చాలా కాలం అయిందని,  చూడాలనిపించి వచ్చానని ఆమె సమాధానం ఇచ్చారు.  వీరు ఇద్దరి మధ్య అలనాటి బాల్య విశేషాలు ముచ్చటిస్తూ ఆమెతో మంత్రి తుమ్మల సరదాగా కాసేపు గడిపారు.