బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ
03-09-2026 | 11:30pm
బోధన్,(విజయక్రాంతి): బోధన్ బైపాస్ రోడ్డు(Bodhan bypass road)లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నిజామాబాద్(Nizamabad) పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.






