అమెరికాలో మేడ్చల్ జిల్లావాసి హత్య
07-06-2026 12:00 AM
మేడ్చల్, జూన్ 6 (విజయ క్రాంతి): అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన కుంచా అన్సుల్ అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. డెలివరీ చేస్తుండగా దుండగులు శుక్రవారం అర్ధరాత్రి యువకుడిపై కాలుపులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. అన్సుల్ మరణ వార్త విని పోచంపల్లిలో కుటుంబీకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.






