3 June, 2026 | 3:28 AM

అమరులను స్మరిస్తూ.. అభివృద్ధి మంత్రం జపిస్తూ..

03-06-2026 12:29 AM

ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

కరీంనగర్/జగిత్యాల/పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (విజయ క్రాంతి) : అమరులను స్మరిస్తూ.. అభివృద్ధి మంత్రం జపి స్తూ..కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తొలుత తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి న రేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు నివాళులు అర్పించారు.

అనంతరం పోలీస్ పరేడ్ మై దానంలో మంత్రి జాతీయజెండను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ’తెలంగాణ రైజింగ్-2047’ దిశానిర్దేశక పత్రాన్ని ఆవిష్కరించిందన్నారు.

కరీంనగర్ జిల్లా లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ’ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రతి ష్ఠాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. మా ర్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, వి ద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత-క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన పది అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో కా ర్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నా రు.  జిల్లాలోని 3 వేల 506 ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరి ష్కార కార్యక్రమం నిర్వహించడం జరిగిందని.

2  వేల 913 పెండింగ్ ఫైళ్లను అధికా రులు పరిష్కరించారని. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని. ఈ మేళాకు హాజరైన 78  కంపెనీలు 292 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని తెలిపారు. మహాలక్ష్మి పథకం క్రింద జిల్లాలో ఒక లక్ష 58 వేల మంది లబ్ధిదారులకు 9 లక్షల 23  వేల 700 సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగిందన్నారు. గృ హజ్యోతి  పథకంలో భాగంగా మార్చి 20 24 నుండి ఇప్పటివరకు ఒక లక్ష 73 వేల 627 మంది వినియోగదారులు 153 కోట్ల రూపాయల లబ్ధిని పొందారన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జిల్లాలో 10 వేల 114 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, 7 వేల 76 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, 2 వేల 81 మంది లబ్ధిదారులు గృహప్రవేశం పూర్తి చేసుకుని స్వం త ఇండ్లలో నివసిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో 319 కొనుగోలు కేం ద్రాల ద్వారా 2 లక్షల 90 వేల 885 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 5 వం దల 54 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందని, 23 వేల 710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 45 వేల 920 కొత్త రేషన్ కార్డులు మం జూరు చేశామని, 96 వేల 775 మంది కు టుంబ సభ్యులను కొత్తగా రేషన్ కార్డుల్లో చే ర్చామని, మొత్తంగా జిల్లాలో 3 లక్షల 20వేల 320 కుటుంబాలకు, ప్రతి నెల 6 వేల 21 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు.

ఈ విద్యా సంవత్సరానికి 2 వేల 535 మంది ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రవేశం కల్పించామని, 2025-26 విద్యా సంవత్సరంలో 29 వేల 240 మంది బీసీ విద్యార్థులకు 74 కోట్ల 43 లక్షల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- జగిత్యాల జిల్లాలో

జగిత్యాలలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహాహ్మద్ అజారుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 783 కోట్ల 70 లక్షల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. వడ్డీ మాఫీ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి 793 కోట్ల 74 లక్షల వడ్డీ మాఫీ నిధులను  అందించడం జరిగిందన్నారు. స్త్రీ నిధి సంస్థ ద్వారా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రుణాలు అందించామన్నారు.

2025-26 యాసంగి కాలానికి 141 కొనుగోళ్లు కేంద్రాల్లో 15 వేల 302 రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసి 292 కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామన్నారు. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని 7 కోట్ల 69 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారన్నారు. 318  కో ట్ల 99 లక్షల రూపాయల లబ్ధి పొందారని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1 లక్ష 98 వేల 417 గ్యాస్ సి లిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగిందని, దీనికి 23 కోట్ల 74లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.

గృహజ్యోతి పథకంలో జిల్లాలో 2 లక్షల 10 వేల 376  సర్వీసులకు గాను 167 కోట్ల 11 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.  ఇందిరా మహిళా శక్తి జిల్లాలో 381 వ్యక్తిగత యూనిట్లకు 13 కోట్ల 33 లక్షల రూపాయలు ల క్ష్యంగా నిర్దేశించగా, 376 మహిళా సంఘాల వ్యక్తిగత యూనిట్లకు ఈ ఏడాది 8 కోట్ల 75 లక్షల రుణాలను ఇప్పించామన్నారు. జిల్లా లో  ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా, దరఖాస్తు చేసుకున్న 10 వేల 860 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 వేల 745 ఇండ్ల నిర్మాణాలలో ఒక వెయ్యి 274 ఇండ్లు పూర్తయ్యాయని, దీనికి గాను 202 కోట్ల 53 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు.

 జిల్లాలో 45 వేల 617 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని, 86వేల 24 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో యాసంగి సీజన్ 2025-26లో 444 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55 వేల 141 రైతుల నుండి కొనుగోలు చేసి 745 కోట్ల 13 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- పెద్దపల్లి జిల్లాలో...

పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ  విప్ చింతకుంట విజయరమణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జూన్ 2 నుంచి కోటి 15 లక్షల కుటుంబాలకు 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత  బీమా అందించనున్నామని తెలిపారు. ప్రా థమిక పాఠశాల నుంచి ఇంటర్ వరకు వి ద్యార్థులకు నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభిస్తామని తెలిపారు.  1,54,598 మంది రైతులకు 114 కోట్ల 4 లక్షల రైతు భ రోసా నిధులు జమ చేశామన్నారు.  767 కో ట్ల విలువైన 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 1,39, 760 కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు.

ఉ చిత బస్సు ప్రయాణంతో జిల్లా మహిళలకు 193 కోట్లు ఆదా చేశామని తెలిపారు. మహి ళా సంఘాలకు 507 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించామన్నారు. 74,157 వ్యవసాయ కనెక్షన్లకు 382 కోట్ల 65 లక్షల సబ్సిడీతో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 14,983 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు అందించామన్నారు. 6451 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు 126 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.

93 వేల 659 మంది లబ్ధిదారులకు 252.22 కోట్ల చేయూత పెన్షన్ పంపిణీ చేశామన్నారు. అభయహస్తం కార్యక్రమం కింద జిల్లాలో 9,823 కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు 8,978 మంది కొత్త సభ్యులను పాత కార్డుల్లో చేర్చామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,953 మంది లబ్ధిదారులకు 4,73,691 గ్యాస్ సిలిండర్లను 14.03 కోట్ల సబ్సిడీతో 500కే అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ, డిసిపి రాంరెడ్డి, డిఆర్‌ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ,ఆర్డీఓ బి. గంగయ్య, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- సిరిసిల్ల జిల్లాలో...

ఎస్పీ కార్యాలయం సమీపంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిణీ చేసే ఏకరూప చీరలు 6 కోట్ల 22 లక్షల మీ టర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు 2025లో కేటాయించడం జరిగింద న్నారు. వేములవాడలో 50 కోట్ల రూపాయలతో ఏ ర్పాటు చేసిన యారన్ డిపో ద్వారా 90 శా తం క్రెడిట్ పై నూలును ఇవ్వడం జరుగుతుందన్నారు.

నేతన్న భద్రత పథకం కింద 5 వేల 864 మంది కార్మికులకు బీమా సౌక ర్యం కల్పించడం జరిగిందని, ఇప్పటివరకు అకాల మరణం చెందిన మరమగ్గాల, చేనేత పరిశ్రమకు చెందిన 122 మంది కార్మిక కు టుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 6 కోట్ల 10 లక్షల రూపాయలు అందజేశామన్నారు. నేతన్న కు పొడుపు పథకం కింద 2025 కాలానికి జిల్లాలోని 4 వేల 963 మంది కార్మికులకు  12 కోట్ల 40 లక్షల రూపాయలను ప్రభుత్వ వాటా కింద విడుదల చేసిందన్నారు.

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 291 కోట్ల రూపాయలు మంజూరు అ య్యాయని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అన్నారు. ఆలయ విస్తరణ పనులు, వీటీఏడీఏ పరిధిలోని గ్రామాల్లో మోడల్ బ స్టాప్ లు, కొదురుపాక బ్రిడ్జి నుండి నంది క మాన్ వరకు 4 వరుసల రోడ్డు, ఇతర అభివృద్ధి పనుల కోసం 980 కోట్ల రూపాయ లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాలో మొత్తం 6 వేల 448 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో యాసంగి సీజన్ లో ఇప్పటివరకు 2 లక్షల 56 వేల 383 మెట్రిక్ టన్నుల ధాన్యం 236 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. జి ల్లాలో 23 వేల 411 ఆహార భద్రత నూతన కార్డుల మంజూరు చేసి, ఇప్పటికే ఉన్న రేష న్ కార్డుల్లో 40 వేల 23 మంది పేర్లు నూతనంగా నమోదు చేయడం జరిగిందన్నారు.  500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫ రా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 3 వేల 487 కుటుంబాల బ్యాంక్ ఖాతా ల్లో 11 కోట్ల 56 లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేయడం జరిగిందన్నారు.

మ హాలక్ష్మి పథకంలో జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి మే 2026 వరకు 163 కోట్ల 40 లక్ష ల రూపాయల విలువైన 4 కోట్ల 9 లక్షల జీ రో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారన్నారు. గృహ జ్యోతి పథకంలో భాగంగా మార్చి 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు మొత్తం 25 లక్షల 85 వేల 552 జీరో బిల్లు లు జారీ చేసి, 99 కోట్ల 46 లక్షల రూపాయ ల లబ్ది చేకూర్చామన్నారు. జిల్లాలోని 8 వేల 96 సంఘాలకు గానూ ఇప్పటివరకు 337 సంఘాలకు 40 కోట్ల 20 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపా రు.

జిల్లాలో 1 లక్షా 15 వేల 820 మంది ల బ్దిదారులకు ప్రతి నెల 23 కోట్ల 34  లక్షల ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలె క్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల స త్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీవో కే ఎస్ బీ కుమారి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పి  నాగేంద్రాచారి, సిరిసిల్ల తహసిల్దార్‌తదితరులు పాల్గొన్నారు.