15 July, 2026 | 8:14 PM

కేటీపీపీ రెండవ దశలో అరుదైనశ రికార్డ్

15-07-2026 07:46 PM

100 రోజుల నిరంతర విద్యుత్ ఉత్పత్తి

గణపురం,(విజయక్రాంతి): కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) స్టేజ్-2 600 మెగావాట్ల యూనిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి అంతరాయం లేకుండా 100 రోజుల పాటు నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేసి మరో విశిష్ట రికార్డును సొంతం చేసుకుంది. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ ఏడాది జూలై నెల వరకు ఒకే సంవత్సర కాలంలో మూడు సార్లు 100 రోజులకు పైగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి అరుదైన ఘనతను సాధించింది.

నిరంతర విద్యుత్ ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి:

2025 ఆగస్టు 7 నుంచి 2025 నవంబర్ 20 వరకు 105 రోజులు

2025 నవంబర్ 23 నుంచి 2026 మార్చి 17 వరకు – 114 రోజులు 

2026 ఏప్రిల్ 4 నుంచి 2026 జూలై 13 వరకు 100 రోజులు

ఇంకా నిరంతరాయంగా కొనసాగుతోంది

ఈ సందర్భంగా కేటీపీపీ చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ, ఈ ఘన విజయం సంస్థ సాంకేతిక నైపుణ్యం, సమర్థవంతమైన నిర్వహణ, ఉద్యోగుల అంకితభావం, కృషి  సమన్వయానికి నిదర్శనమని తెలిపారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ విజయాన్ని ప్రాజెక్టు ఉద్యోగులందరితో కలిసి ఆనందంగా పంచుకున్నట్లు పేర్కొన్నారు.