బిక్కనూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
20-08-2026 04:36 PM
బిక్కనూర్, ఆగస్టు 20: బిక్కనూర్‌లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సేవాదళ్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని మాధవరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కంచర్ల గ్రామ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు భిక్షపతి గౌడ్, పెంజర్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ యూత్ అధ్యక్షుడు సరుగు సందీప్ పాల్గొన్నారు.






