19 May, 2026 | 10:05 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి

17-02-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి16: నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని ఎంపీడీఓ పల్లపు ఝాన్సీ అన్నారు. సోమవారం మండలంలోని రామన్నగూడెం గ్రామ రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి,పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5సంవత్సరాల పాటు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ గోపి,శిక్షకులు సుధాకర్,సతీష్,సలీం,జూనియర్ అసిస్టెంట్ శిల్పిక,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.