23 June, 2026 | 5:13 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

23-06-2026 01:22 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22(విజయ క్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖా స్తులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

వివిధ సమస్యలపై జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన కలెక్టర్, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్, డీఆర్వో దాసరి వేణు తదితర అధికారులు పాల్గొన్నారు.