కరీంనగర్ ఘటనకు రాజకీయ రంగు
కరీంనగర్, మే 4 (విజయక్రాంతి): కరీంనగర్ ఘటనకు రాజకీయ రంగు పులుము కుంది. కరీంనగర్లో జరిగిన జ్యూవెలరీ షాపు కాల్పుల ఘటన తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు భిన్నమైన వాదనలు వినిపిస్తూ దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు.
ప్రధాన రాజకీయ పరిణామాలు:
సోమవారం కె టి ఆర్ రాకతో మరింత వేదక్కింది. కె టి ఆర్ రాష్ట్రం నేరా ల్లో నెంబర్ వన్ గా ఉందని విరుచుకు పడగ ప్రభుత్వం విప్ అది శ్రీనివాస్ నుండి నేతలంతా కౌంటర్ అటాక్ కు దిగారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఘటనను తీవ్రం గా ఖండించారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది శాంతిభద్రతల సమస్య అని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల భద్రత పూర్తిగా కుప్పకూలిందని, ఈ ఘటన పోలీసుల వైఫల్యమని ఫైర్ కావడంతో మాటల తూటాలు పేలందం ప్రారంభమైనయి. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది, ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవద్దని బండి సంజయ్ కోరినప్పటికీ, ఇతర పార్టీలు దీనిని శాంతిభద్రతల అంశంగా లేవనెత్తుతున్నాయి.ఈ సంఘటనకు సంబంధించిన తాజా పరిణామాలను గమనిస్తే, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది.






