28 July, 2026 | 1:47 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

చేయుత (ఆసరా) పింఛన్లలో ‘చిల్లర’ కోత

01-06-2026 01:46 AM
  1. చిల్లర లేదని రూ.616 దాకా ఇవ్వని పోస్టల్ సిబ్బంది ఇవ్వట్లేదు
  2. కొన్ని గ్రామాల్లో మిగిలిన రూ. 6 ఇవ్వట్లేదు
  3. మరికొందరికితే వచ్చే నెల ఇస్తానని బుకాయింపు 
  4. దివ్యాంగులు, వృద్ధులు ఎండలో పడి కాపులు 
  5. సమయానికి రాని పోస్టల్ సిబ్బంది

చేయూత (ఆసరా) పింఛన్ల  పంపిణీలో పోస్టల్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ. 4,016 ఇస్తున్న సంగతి       తెలిసిందే. ఈ డబ్బులు పంచుతున్నపోస్టల్ సిబ్బంది చిల్లర లేదని, వచ్చే నెల ఇస్తామని రూ. 6 నుంచి రూ.16 దాకా తక్కువ ఇస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

బోధన్: మే 31 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, వితంతువులు,  చేయూత పథకం కింద ప్రతి నెలా పింఛన్లను అందిస్తోంది. ప్రభుత్వం మండల వారీగా ఈ పింఛన్లను బోధన్,సాలుర, 8,965  రెంజల్ 17552,  మండలంలో నాలుగు రోజుల నుంచి పంపిణీ చేస్తున్నారు. 

బోధన్ 28 గ్రామాలు, సాలుర 12 గ్రామాలు, ఎడపల్లి 10 గ్రామాలు, రెంజల్ 17  గ్రామాలు, నవపేట్ 32 గ్రామాలు, 94 గ్రామాలు ఉన్నప్పటికీ గ్రామానికి 50 మంది వద్ద 10 రూపాయలు లెక్కించిన ఒక్కొక్క పోస్ట్ మేన్  వేతనాల కంటే తీసుకునుడే ఎక్కువ అవుతుంది.  బోధన్ పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుండగా గ్రామీణులకు పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్నారు. ఈ శాఖ సిబ్బంది లబ్దిదారుల వేలిముద్రలు తీసుకొని నగదు మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుంది. కానీ చిల్లర లేదంటూ రూ.4010, రూ.2010 లబ్ధిదారుల చేతిలో 2 వేలు పెడుతున్నారు. మిగిలిన రూ.6  ఇవ్వడం లేదు. చిల్లర లేదని రూ.616 దాకా ఇవ్వని పోస్టల్ సిబ్బంది ఇవ్వట్లేదు వచ్చేనెల ఇస్తామని బుకాయింపు మిగిలిన రూ. 6 ఇవ్వట్లేదు.

కొన్ని గ్రామాల్లో 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదు, ఇలా ఒక్కో గ్రామంలో 30 మంది నుంచి 50 మంది వరకు ఇస్తలేరు. బోధన్, సాలుర కలుపుకొని రెండు మండలాలు  32 గ్రామాల్లో మొత్తం 8,965 మంది లబ్దిదారులు ఉన్నారు. ఒక పోస్టల్ ఉద్యోగి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మందికి పింఛన్లు అం దజేస్తుంటారు. ఈ లెక్కన ఒక లబ్ధిదారు నుంచి రూ. 6 తీసుకున్నా రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు మిగులుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే చిల్లర లేవు వచ్చే నెల ఇస్తామని చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 16 దాకా తక్కువ ఇస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి మొత్తం డబ్బులు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ వరకు వెళ్తామని లబ్ధిదారులు కొందరు వాపోతున్నారు.

ఒక్కోసారి రూ.16 కూడా ఇవ్వట్లేదు పతినెల 6 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇవ్వరు. చిల్లర తెచ్చి తీసుకెళ్ళు అని అంటారు. 10 రూపాయలు ఇస్తే ఆరు రూపాయలు ఇవ్వరు. ఒక్కోసారి 16 కూడా ఇవ్వట్లేదు.

- కర్ల గంగాధర్, (దివ్యాంగుడు) రెంజల్ మండలం దుపల్లి గ్రామం 

రూ. 6 తక్కువ ఇచ్చిండు నాకు పెంచిన పింఛన్ రూ. 4016 ఉండగా సారు  4,010 ఇచ్చిండు. ఇదేం దని అడిగితే మళ్లచ్చినప్పుడు ఇస్తాన న్నడు. గట్టిగా అడిగితే వచ్చే నెల పింఛన్ ఇవ్వనని బెదిరిస్తున్నడు.

- కోటి పండు, (దివ్యాంగుడు) బోధన్ మండలం ఖండ్గావ్

4 వేలు మాత్రమే ఇచ్చిండ్రు.. నాకు రూ. రెండు వేలే ఇచ్చిండ్రు. ఇంక రూ.16 ఏవని అడిగితే బెదిరిస్తున్నరు. మహిళా ను గనుక గట్టిగా అడగలేకపోతున్నాం. పెద్ద సార్లు మొత్తం పైసలు ఇచ్చేలా చూడాలి.

- వేముల పద్మ , (వితంతువు) సాలూర మండల కేంద్రం 

తక్కువగా ఇస్తున్నారు ప్రతినెలా 6 రూపాయలు లేదా 10 రూపాయలు తక్కువగా ఇస్తున్నారు. చిల్లర లేదనిసరి కంటే వెళ్ళిపోతున్నాం. ఇప్పటికైనా 16 ఇప్పిచ్చేరకంగా చూడండి.

- గైని రాములు , (దివ్యాంగుడు) బోధన్ మండలం పెంటఖురు