13-02-2026 07:50:19 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు శుక్రవారం 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్-2లో రూ.115.00 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును, శ్రీ అభయాంజనేయ–శ్రీ స్పటిక రాజరాజేశ్వర స్వామి క్షేత్ర ఆర్చిని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్‌ను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో కొన్ని చోట్ల ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు వస్తాయని, అలాంటి సందర్భాల్లో ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. అభివృద్ధి పనుల వల్ల నష్టం జరిగిన వారికి వీలైనంత మేర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయవచ్చని, కానీ అభివృద్ధి పనుల్లో ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రోడ్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు వంటి అంశాల్లో పక్కా జిల్లాలతో పోల్చుకుంటే మన ప్రాంతం ఇంకా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా వినియోగించి అభివృద్ధి చేయడమే తమ సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభివన్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్, తాళ్లపల్లి సుధాకర్, కాంగ్రెస్ శ్రేణులు మేరీ, పిట్టల వంశీ, మిడిదొడ్డి శేఖర్, యుగేందర్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు రోకుల సతీష్, నాయకులు నాగపురి అశోక్, రామ్ రాజ్, యాదగిరి, ఆలయ కమిటీ అధ్యక్షులు శేషగిరిరావు, కాలనీవాసులు వెంకటరాజ్యం, చక్రధర్ స్వామి, నారాయణస్వామి అధికారులు ఈ.ఈ రవి కుమార్, డీ.ఈ సారంగం తదితరులు పాల్గొన్నారు.