30 May, 2026 | 5:41 PM

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహణ

30-05-2026 05:06 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ యేమిమా ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, తంబాకు వంటి పొగాకు పదార్థాలను జీవితంలో ఎప్పుడూ వినియోగించబోమని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా చైతన్యం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు.