న్యూజిలాండ్‌దే టెస్ట్ సిరీస్
30-06-2026 12:31 AM
నాటింగ్‌హామ్, జూన్ 29: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2 కైవసం చేసుకుంది. నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన చివరి టెస్టులో కివీ స్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజి లాండ్ 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్ ఇ న్నింగ్స్‌లో బెన్ డకెట్(113) సెంచరీతో రా ణించాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 288/9 వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత ఇంగ్లండ్ 373 పరుగుల భారీ లక్ష్యఛేదనలో చేతులెత్తేసింది. 212 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.






