వీసీని కలిసిన నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు
18-04-2026 01:01 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై పరస్పరం చర్చించి విశ్వవిద్యాలయాన్ని విద్యాబోధనలో పరిశోధన లలో ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేయగా,
ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నూతన సభ్యులకు అభినందనలు తెలియజేసి, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ సమన్వ యంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, విశ్వవిద్యాలయ అ ధికారులు, అధ్యాపకులు, పాల్గొన్నారు.






