6 April, 2026 | 8:06 PM

వరంగల్ మోన్‌ఫోర్ట్ హై స్కూల్‌లో ఎన్‌సీసీ నమోదు

06-04-2026 06:25 PM

హనుమకొండ,(విజయక్రాంతి): కాజీపేట ఫాతిమా సెంటర్లోని మోన్‌ఫోర్ట్ హై స్కూల్‌లో10(టి) బెటాలియన్ ఎన్‌సీసీ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నమోదు కార్యక్రమం  ఎన్‌బి సబ్ అనిల్ జాదవ్ నేతృత్వంలో కేర్‌టేకర్ అధికారి కె. సునీల పర్యవేక్షించారు. అభ్యర్థులు రెండేళ్ల ఎన్‌సీసీ కోర్సుకు అర్హత పొందడానికి శారీరక శిక్షణ, రాత పరీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాఠశాల కరస్పాండెంట్ విన్సెంట్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్‌సీసీ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందుతుందన్నారు.

ఎన్‌బి సబ్ అనిల్ జాదవ్ బృంద ఉత్సాహం, ఫిట్‌నెస్ స్థాయిని కొనియాడారు. కేర్‌టేకర్ అధికారి సునీల మాట్లాడుతూ ఎన్సీసీలో విద్యార్థుల  ఎంపిక ఎన్‌సీసీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగిందని దానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్. రామదురై అందరి ప్రయత్నాలను అభినందించారు. ఎంపికైన కెడెట్‌లు రాబోయే విద్యా సంవత్సరంలో రెగ్యులర్ పరేడ్, సమాజసేవ, నాయకత్వ కార్యక్రమాల్లో ఎన్‌సీసీ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ప్రారంభిస్తారని తెలిపారు.