6 April, 2026 | 8:05 PM

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన బిఆర్ఎస్ నాయకులు

06-04-2026 06:28 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్న మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ హింసకు,తావు ఉండకూడదనన్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అలాగే బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్దయ్య మాట్లాడుతూ... ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సిద్దయ్య, బిసి సంఘం కార్యదర్శి సాయిబాబా, ఇతర నాయకులు పాల్గొని ఈ ఘటనను ఖండించారు.