దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
మాజీమండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
హుజురాబాద్,(విజయక్రాంతి): దేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఇల్లందకుంట మాజీమండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరపతి రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలంలోనీ కనగర్తి గ్రామంలో బూత్ అధ్యక్షుడితో కలిసిజెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ భారత దేశంలో అత్యంత రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. దేశ అభివృద్ధి జాతీయ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. "సబ్కా సాత్,సబ్కా వికాస్" సబ్కా విశ్వాస్" అనే నినాదంతో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. పేదల సంక్షేమం,రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు అంశాలలో అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు.




